కీర్తనలు 2

2
1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?
జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
2–మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము
రండి అని చెప్పుకొనుచు
3భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని
విరోధముగా నిలువబడుచున్నారు
ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు
ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
5ఆయన ఉగ్రుడై వారితో పలుకును
ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
6–నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద
నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
7కట్టడను నేను వివరించెదను
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను
–నీవు నా కుమారుడవు
నేడు నిన్ను కనియున్నాను.
8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
9ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా
పగులగొట్టెదవు
10కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి
భూపతులారా, బోధనొందుడి.
11భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి
గడగడ వణకుచు సంతోషించుడి.
12ఆయన కోపము త్వరగా రగులుకొనును
కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన
కోపించును
అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.
ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 2: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 2