కీర్తనలు 142
142
గుహలో నున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దైవధ్యానము.
1నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను.
ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.
2బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ
పెట్టుచున్నాను
నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను
చున్నాను.
3నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా
మార్గము నీకు తెలియును
నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో
చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.
4నా కుడిప్రక్కను నిదానించి చూడుము
నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను
ఆశ్రయమేదియు నాకు దొరకలేదు
నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.
5యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను
నా ఆశ్రయదుర్గము నీవే
సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని
నేననుకొంటిని.
6నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి
యొగ్గుము
నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో
నుండి నన్ను విడిపింపుము.
7నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు
చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము
అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట
చూచి
నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 142: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.