కీర్తనలు 129

129
యాత్రకీర్తన.
1ఇశ్రాయేలు ఇట్లనును
–నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు
అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి
2నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు
కలుగజేయుచు వచ్చిరి.
అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.
3దున్నువారు నా వీపుమీద దున్నిరివారు చాళ్లను పొడుగుగా చేసిరి.
4యెహోవా న్యాయవంతుడు
భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.
5సీయోను పగవారందరు
సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
6వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక
ఎదుగకమునుపే అది వాడిపోవును
7కోయువాడు తన గుప్పిలినైనను
పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు
కొనడు.
8దారిన పోవువారు–యెహోవా ఆశీర్వాదము నీమీదనుండునుగాక
–యెహోవా నామమున మేము మిమ్ము దీవించు
చున్నాము అని అనకయుందురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 129: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి