కీర్తనలు 122

122
యాత్ర కీర్తన. దావీదుది.
1–యెహోవా మందిరమునకు వెళ్లుదమని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
2యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో
నిలుచుచున్నవి
3యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు
కట్టబడియున్నావు
4ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి
యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి
ఎక్కి వెళ్లును.
5అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు
దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి
యున్నవి.
6యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన
చేయుడి
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
7నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక.
నీ నగరులలో క్షేమముండును గాక.
8నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి
త్తమును
నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
9మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము
నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 122: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి