కీర్తనలు 114

114
1ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు
అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు
వెళ్లినప్పుడు
2యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను
ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.
3సముద్రము దానిని చూచి పారిపోయెను
యొర్దాను నది వెనుకకు మళ్లెను.
4కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను
గంతులు వేసెను.
5సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి
నది?
యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?
6కొండలారా, మీరు పొట్లేళ్లవలెను
గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయు
టకు మీకేమి సంభవించినది?
7భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని
ధిని వణకుము
8ఆయన బండను నీటిమడుగుగాను
చెకుముకి రాతిబండను నీటి ఊటలుగానుచేయు
వాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 114: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 114