కీర్తనలు 110

110
దావీదు కీర్తన.
1ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు
–నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా
చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
2యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి
సాగజేయుచున్నాడు
నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
3యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా
వచ్చెదరు.
నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు
వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
4–మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము
యాజకుడవైయుందువని
యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన
మాట తప్పనివాడు.
5ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి
తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
6అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును
దేశము శవములతో నిండియుండును
విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
7మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 110: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 110