సామెతలు 17

17
1రుచియైన భోజన పదార్థములున్నను
కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె
నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
2బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడిచేయును
అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును.
3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది
హృదయ పరిశోధకుడు యెహోవాయే.
4చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును
నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి
కుడు చెవియొగ్గును.
5బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు.
ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.
6కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము
తండ్రులే కుమారులకు అలంకారము.
7అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు
అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.
8లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును
అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.
9ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును.
జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును.
10బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె
బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
11తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును
అట్టివానివెంట క్రూరదూత పంపబడును.
12పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన
వచ్చును గాని
మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన
రాదు
13మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు
తొలగిపోదు.
14కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట
వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.
15దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు
నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు
16వీరిద్దరును యెహోవాకు హేయులు.
బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు
సొమ్ముండ నేల?
వానికి బుద్ధి లేదు గదా?
17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును
దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు
తెలివిమాలినవాడు.
19కలహప్రియుడు దుర్మార్గప్రియుడు
తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.
20కుటిలవర్తనుడు మేలుపొందడు
మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.
21బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును
తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.
22సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
23న్యాయవిధులను చెరుపుటకై
దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.
24జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది
బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును.
25బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము
తెచ్చును
తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును
26నీతిమంతులను దండించుట న్యాయము కాదు
అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము
చేయుటే.
27మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు
శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
28ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని
అని యెంచబడును
అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని
యెంచబడును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 17: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి