నెహెమ్యా 7

7
1నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట 2నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులుగలవాడు. 3అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. 4అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు. 5జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. 6జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలురాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి 7తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే. 8అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును 9షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును 10ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును 11యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు 12ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును. 13జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును 14జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు 15బిన్నూయి వంశస్థులు ఆరువందల నలువది యెనమండుగురును 16బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును 17అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును 18అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువదియేడుగురును 19బిగ్వయి వంశస్థులు రెండువేల అరువదియేడుగురును 20ఆదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును 21హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంబది యెనమండుగురును 22హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును 23బేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును 24హారీపు వంశస్థులు నూటపండ్రెండుగురును 25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును 26బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండుగురును 27అనాతోతువారు నూట ఇరువది యెనమండుగురును 28బేతజ్మావెతువారు నలువది యిద్దరును 29కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును 30రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును 31మిక్మషువారు నూట ఇరువది యిద్దరును 32బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును 33-35రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు 36యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును 37లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును 38సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పదిమందియు 39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును 40ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును 41పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురును 42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును 43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును 44గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును 45ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూటముప్పది యెనమండుగురును 46నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు 47కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు 48లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు 49హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు 50రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు 51గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు 52బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూ షేసీము వంశస్థులు. 53బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు 54బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు 55బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు 56-57సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు 58యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు 59షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు. 60ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
61తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. 62వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు 63హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానములు. 64వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి. 65కాగా అధికారి–ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతిపరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. 66సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది. 67వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడువేల మూడు వందల ముప్పదియేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి. 68వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదును 69వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియునై యుండెను.
70పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను. 71మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి. 72మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి. 73అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 7: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in