నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులుగలవాడు. అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు. జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలురాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే. అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును. జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు బిన్నూయి వంశస్థులు ఆరువందల నలువది యెనమండుగురును బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువదియేడుగురును బిగ్వయి వంశస్థులు రెండువేల అరువదియేడుగురును ఆదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంబది యెనమండుగురును హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును బేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును హారీపు వంశస్థులు నూటపండ్రెండుగురును గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండుగురును అనాతోతువారు నూట ఇరువది యెనమండుగురును బేతజ్మావెతువారు నలువది యిద్దరును కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును మిక్మషువారు నూట ఇరువది యిద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పదిమందియు యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురును హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూటముప్పది యెనమండుగురును నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూ షేసీము వంశస్థులు. బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానములు. వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి. కాగా అధికారి–ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతిపరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది. వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడువేల మూడు వందల ముప్పదియేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి. వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదును వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియునై యుండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
చదువండి నెహెమ్యా 7
వినండి నెహెమ్యా 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నెహెమ్యా 7:1-73
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు