యెహోషువ 4:19-24

యెహోషువ 4:19-24 TELUBSI

మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులోనుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను–రాబోవు కాలమున మీ సంతతివారు – ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా; అప్పుడు మీరు–ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును, మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్లను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.