యెహోషువ 16

16
1యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను, 2-3తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను. 4అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి.
5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను. 6వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రమువరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్షీలో వరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి 7యానోహానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. 8తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించెను. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. 9ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. 10అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్ను కట్టు దాసులైయున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 16: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెహోషువ 16