యెహోషువ 12:7-24

యెహోషువ 12:7-24 TELUBSI

యొర్దానుకు ఇవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండవరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణదేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లష్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నెయాము రాజు, దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య ముప్పది యొకటి.