యోబు 39

39
1అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు
తెలియునా?
లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2అవి మోయు మాసములను నీవు లెక్కపెట్టగలవా?
అవి యీనుకాలము ఎరుగుదువా?
3అవి వంగి తమ పిల్లలను కనును
తమ#39:3 నొప్పులు. పిల్లలను వేయును.
4వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును
అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
5అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు?
అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
6నేను అరణ్యమును దానికి ఇల్లుగాను
ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును
తోలువాని కేకలను అది వినదు.
8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి
ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా?
అది నీ శాలలో నిలుచునా?
10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట
గలవా?
అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా?
దానికి నీ పని అప్పగించెదవా?
12అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న
ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
13నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును.
రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది
వాత్సల్యము కలదిగా నున్నదా?
14లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును
ధూళిలో వాటిని కాచును.
15దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను
అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను
అనుకొనకయే యున్నది.
16తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము
చూపును
దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను
ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ
లేదు.
18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును
తిరస్కరించును.
19గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా?
జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
20మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా?
దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
21మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి
సంతోషించును
అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
22అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద
కుండును
ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
23అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును
దానిమీద గలగలలాడించబడునప్పుడు
24ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును
అది బాకానాదము విని ఊరకుండదు.
25బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా
అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి
కొనును
సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఫెూషను వినును.
డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా?
26అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు
చాచునా?
27పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా?
తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
28అది రాతికొండమీద నివసించును
కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు
చోటను గూడు కట్టుకొనును.
29అక్కడనుండియే తన యెరను వెదకును.
దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
30దాని పిల్లలు రక్తము పీల్చును
హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది
యుండును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 39: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in