యోబు 27

27
1యూబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను–
2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను
బట్టియు
దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను
బట్టియు
3నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు
నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
4నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు
నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
5మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను
మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను
విడువను.
6నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును
నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము
నన్ను నిందింపదు.
7నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక
నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.
8దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము
తీసివేయునప్పుడు
భక్తిహీనునికి ఆధారమేది?
9వానికి బాధ కలుగునప్పుడు
దేవుడు వాని మొఱ్ఱ వినునా?
10వాడు సర్వశక్తునియందు ఆనందించునా?
వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన
చేయునా?
11దేవుని హస్తమునుగూర్చి నేను మీకు ఉపదేశించెదను
సర్వశక్తుడుచేయు క్రియలను నేను దాచిపెట్టను.
12మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు
మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు
చుందురు?
13దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది
ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము
14వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత
పడుటకే గదావారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.
15వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట
బడెదరువారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
16ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను
జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ
పరచుకొనినను
17వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు
దాని కట్టుకొనెదరు
నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
18పురుగుల గూళ్లవంటి యిండ్లువారు కట్టుకొందురు
కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లువారు
కట్టుకొందురు.
19వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల
లేవరు
కన్నులు తెరవగానే లేకపోవుదురు.
20భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు
కొనును
రాత్రివేళ తుపాను వారిని ఎత్తికొనిపోవును.
21తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవుదురు
అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
22ఏమియు కరుణ చూపకుండ
దేవుడు వారిమీద బాణములు వేయునువారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు
అటు పారిపోవుదురు.
23మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురువారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 27: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in