యోబు 25

25
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు
త్తరమిచ్చెను–
2అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి
ఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ
జేయును.
3ఆయన సేనలను లెక్కింప శక్యమా?
ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
4నరుడు దేవునిదృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?
స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు
కాగలడు?
5ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు
నక్షత్రములు పవిత్రమైనవి కావు.
6మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు
పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 25: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in