యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు –నీవు యెహోవామందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము–యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలోబడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి –ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగువానియెడల తప్పక న్యాయము జరిగించి. పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.
Read యిర్మీయా 7
వినండి యిర్మీయా 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యిర్మీయా 7:1-8
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు