యిర్మీయా 51
51
1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపు
రముచేసి
నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన
వాయువును రప్పించెదను.
2అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నానువారు ఆ దేశమును తూర్పారపెట్టి దాని వట్టిదిగా
చేయుదురు
ఆపద్దినమునవారు నలుదిక్కులనుండి దానిమీదికి
వచ్చెదరు.
3విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను
కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను
కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును
దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును
4యౌవనులను కొట్టక మానకుడి
దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.
5తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా
ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు
గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా
తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి
యున్నది.
6మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు
బబులోనులోనుండి పారిపోవుడి
మీ ప్రాణములు రక్షించుకొనుడి
ఇది యెహోవాకు ప్రతికారకాలము
అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము
చేయుచున్నాడు.
7బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు
కలిగించు బంగారుపాత్రయైయుండెను.
దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు.
8బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ
లాయెను
దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో
దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.
9మనము బబులోనును స్వస్థపరచగోరితిమి
అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి.
మన మన దేశములకు వెళ్లుదము రండి
దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది
అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది
10యెహోవా మన న్యాయమును రుజువుపరచు
చున్నాడు
రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన
పని మనము వివరించుదము.
11బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి
బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు
చున్నాడు
మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు
చున్నాడు.
అది యెహోవాచేయు ప్రతి దండన
తన మందిరమునుగూర్చి ఆయనచేయు ప్రతి దండన.
12బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము
నిలువబెట్టుడి
కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు
లను సిద్ధపరచుడి
బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని
బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను
జరిగింపబోవుచున్నాడు.
13విస్తారజలములయొద్ద నివసించుదానా,
నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది
అన్యాయలాభము నీకిక దొరకదు.
14గొంగళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను
నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయు
దురు
15నా జీవముతోడని సైన్యములకధిపతియగు యెహోవా
ప్రమాణము చేయుచున్నాడు
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను
తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను
తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
16ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండల
ములో పుట్టును.
భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క
జేయును
వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును
తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
17తెలివిలేక ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు
పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును
బట్టి అవమానమొందును
అతడు పోతపోసినది మాయారూపము దానిలో
ప్రాణమేమియు లేదు.
18అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు
విమర్శకాలమున అవి నశించిపోవును.
19యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు
కాడు
ఆయన సమస్తమును నిర్మించువాడు
ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
20నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు
యుద్ధాయుధమువంటివాడవు
నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను
నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.
21నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను.
నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు
చున్నాను.
22నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను
నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను
నీవలన యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.
23నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను
విరుగగొట్టుచున్నాను
నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగ
గొట్టుచున్నాను
నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.
24బబులోనును కల్దీయుల దేశనివాసులును
మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి
నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే
యెహోవా వాక్కు.
25–సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా,
నేను నీకు విరోధిని
ఇదే యెహోవా వాక్కు.
నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను
క్రిందికి దొరలించుదును
26చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
మూలకుగాని పునాదికిగాని
నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు
నీవు చిరకాలము పాడై యుందువు
ఇదే యెహోవా వాక్కు.
27దేశములో ధ్వజములనెత్తుడి
జనములలో బాకానాదము చేయుడి
దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి
దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు
అను రాజ్యములను పిలిపించుడి
దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియ
మించుడి
రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము
లను దానిమీదికి రప్పించుడి.
28దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి
అధిపతులను వారి యేలికలను
అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని
ప్రతిష్ఠించుడి
29భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజలాడు చున్నది
ఒక్క నివాసియులేకుండ బబులోను దేశమును
పాడుగా చేయవలెనని
బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర
మాయెను.
30-32బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను
దురువారు తమ కోటలలో నిలుచుచున్నారువారి పరాక్రమము బలహీనత ఆయెనువారును స్త్రీలవంటివారైరివారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి
వారి అడ్డగడియలు విరిగిపోయెను
అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము
లును జమ్మును అగ్నిచేత కాల్చబడును
దాని యోధులు దిగులుపడిరి
అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును
దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు
నకు తెలియజేతురు.
దాని రేవులు శత్రువశమాయెను.
33ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబు
లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను
ఇంక కొంతసేపటికి దానికి కోతకాలమువచ్చును.
34బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మ్రింగివేసెను
మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి
యున్నాడు
భుజంగము మ్రింగునట్లు మమ్మును మ్రింగెను
మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును
పారవేసియున్నాడు.
35నాకును నా దేహమునకును చేయబడిన హింస
బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును
గాక యని సీయోను నివాసి యనుకొనును
నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక
అని యెరూషలేము అనుకొనును.
36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆల
కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును
నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును
దాని సముద్రమును నేనెండకట్టుదును
దాని ఊటను ఇంకిపోజేయుదును.
37బబులోను నిర్జనమై కసవు దిబ్బలుగా ఉండును
నక్కలకు నివాసస్థలమగును
అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.వారు కూడి సింహములవలె బొబ్బరింతురు
సింహముల పిల్లలవలె గుఱ్ఱుపట్టుదురు.
38వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర
నొందునట్లు
39వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని
మత్తిల్లజేసెదను
ఇదే యెహోవా వాక్కు.
40గొఱ్ఱెపిల్లలు వధకు పోవునట్లును
మేకపోతులును పొట్టేళ్లును వధకు పోవునట్లును
వారిని వధకు రప్పించెదను.
41షేషకు పట్టబడెను
జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను
బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.
42సముద్రము బబులోనుమీదికి వచ్చెను
ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.
43దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను
అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను
ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు.
44బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను
వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించు
చున్నాను
ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా
కూడి రావు
బబులోను ప్రాకారము కూలును;
45నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు
వెళ్లుడి
యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి
మీ ప్రాణములను రక్షించుకొనుడి
46ఏటేట వదంతి పుట్టుచువచ్చును
దేశములో బలాత్కారము జరుగుచున్నది
ఏలికమీద ఏలిక లేచుచున్నాడు
దేశములో వినబడు వదంతికి భయపడకుడి
మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.
47రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన
విగ్రహములను శిక్షింతును
దాని దేశమంతయు అవమానము నొందును
జనులు హతులై దానిమధ్యను కూలెదరు
48దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని
యొద్దకు వచ్చుచున్నారని
ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును
బబులోను గతినిగూర్చి సంతోషించును
ఇదే యెహోవా వాక్కు
49బబులోను ఇశ్రాయేలులో హతులైనవారిని కూలజేసి
నట్లు
సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు
కూలుదురు
50ఖడ్గమును తప్పించుకొనినవారలారా,
ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి
మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి
యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి.
51మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము
అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి
వచ్చియున్నారు
మా ముఖములు తెల్లబోవుచున్నవి
52ఇదే యెహోవా వాక్కు.
–రాబోవు దినములలో నేను బబులోనుయొక్క
విగ్రహములను శిక్షింతును
ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గు
దురు.
53బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా
చేసికొని ఆకాశమునకు ఎక్కినను
పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద
పడుదురు
ఇదే యెహోవా వాక్కు.
54ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడుచున్నది
కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.
55యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు
దాని మహాఘోషను అణచివేయుచున్నాడు
వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించుచున్నవివారి ఆర్భాటము వినబడుచున్నది.
56బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు
దాని బలాఢ్యులు పట్టబడియున్నారు
వారి విండ్లు విరిగిపోయినవి
యెహోవా ప్రతికారముచేయు దేవుడు గనుక
నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.
57దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి
పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదనువారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు
ఇదే రాజు వాక్కు
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
58సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల
విచ్చుచున్నాడు
విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడ
గొట్టబడును
దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయ
బడును
–జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు
అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు
ప్రజలు చూచి అలయుచున్నారు.
59సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట. 60యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనునుగూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములో వ్రాసెను. 61కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను– నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను. 62ఈలాగున నీవు ప్రకటింపవలెను– యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి. 63ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి 64నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 51: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.