యిర్మీయా 48
48
1మోయాబునుగూర్చినది.
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు
చున్నాడు.
–నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది.
కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది
ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది
ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
2హెష్బోనులో వారు–అది ఇకను జనము కాకపోవు
నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు
దానికి కీడుచేయనుద్దేశించుచున్నారు
మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి.
ఖడ్గము నిన్ను తరుముచున్నది.
3ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని
వినబడుచున్నది
దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ
వించుచున్నది.
4మోయాబు రాజ్యము లయమై పోయెను
దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని
వినబడుచున్నది
జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు
ఏడ్చుచు ఎక్కుచున్నారు.
6పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి
అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.
7నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను
నమ్ముకొంటివి
నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికిపోవును
ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును
చెరలోనికి పోవుదురు.
8యెహోవా సెలవిచ్చునట్లు
సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును
ఏ పట్టణమును తప్పించుకొనజాలదు
లోయ కూడ నశించును మైదానము పాడైపోవును.
9మోయాబునకు రెక్కలు పెట్టుడి
అది వేగిరముగా బయలుదేరి పోవలెను.
నివాసి యెవడునులేకుండ దాని పట్టణములు
పాడగును.
10యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు
శాపగ్రస్తుడగును గాక
రక్తము ఓడ్చకుండ ఖడ్గము దూయువాడు శాపగ్రస్తు
డగును గాక.
11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను
ఈకుండలోనుండి ఆకుండలోనికి కుమ్మరింపబడకుండ
అది మడ్డిమీద నిలిచెను
అదెన్నడును చెరలోనికి పోయినది కాదు
అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది
దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు
వారిని పంపెదను.వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
13ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి
సిగ్గుపడినట్లు
మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
14–మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు
మీరెట్లు చెప్పుకొందురు?
15మోయాబు పాడైపోవుచున్నది
శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు
వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు
సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు
సెలవిచ్చినమాట యిదే.
16మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది
దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.
17దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి
దాని కీర్తినిగూర్చి వినినవారలారా, అంగలార్చుడి
బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము
విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.
18దేబోనులో ఆసీనురాలై యుండుదానా,
మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు
చున్నాడు.
నీ కోటలను నశింపజేయుచున్నాడు.
నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము
ఎండినదేశములో కూర్చుండుము.
19ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము
పారిపోవుచున్న వారియొద్ద విచారించుము
తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము
ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది
యున్నది
గోలయెత్తి కేకలువేయుము
మోయాబు అపజయము నొందెను.
21అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది
హోలోనునకును యాహసునకును మేఫాతునకును
దీబోనుకును
22నెబోకును బేత్–దిబ్లాతయీమునకును కిర్యతాయిమున
కును బేత్గామూలునకును
23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును
24దూరమైనట్టియు సమీపమైనట్టియు
మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి
యున్నది.
25మోయాబు శృంగము నరికివేయబడియున్నది
దాని బాహువు విరువబడియున్నది
యెహోవా వాక్కు ఇదే.
26మోయాబు యెహోవాకు విరోధముగా తన్నుతాను
గొప్పచేసికొనెను
దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో
పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
27ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా?
అతడు దొంగలకు జతగాడైనట్టుగా
నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు
వచ్చితివి
28మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి
కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె
కొండలో కాపురముండుడి.
29-30మోయాబీయుల గర్వమునుగూర్చి వింటిమి,వారు బహు గర్వపోతులు
వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు
మాకు సమాచారము వచ్చెనువారి తామసమును వచించరాని వారి ప్రగల్భము
లును నాకు తెలిసేయున్నవి
చేయదగని క్రియలువారు బహుగా చేయుచున్నారు
ఇదే యెహోవా వాక్కు
31కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు
చున్నాను
మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నానువారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.
32సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును
మించునట్లు
నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను
నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను
అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను
నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను
పాడుచేయువాడు పడెను.
33ఫలభరితమైన పొలములోనుండియు
మోయాబు దేశములోనుండియు
ఆనందమును సంతోషమును తొలగిపోయెను
ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమునులేకుండచేయు
చున్నాను
జనులు సంతోషించుచు త్రొక్కరు
సంతోషము నిస్సంతోషమాయెను.
34నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను
హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు
వరకును
సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును
జనులు కేకలువేయుచున్నారు.
35ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని
దేవతలకు ధూపమువేయువారిని
మోయాబులో లేకుండజేసెదను
ఇదే యెహోవా వాక్కు.
36వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను
మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె
నాదము చేయుచున్నది
కీర్హరెశెతువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగుచున్నది.
37నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను
ప్రతి గడ్డము గొరిగింపబడెను
చేతులన్నిటిమీద నరుకులును
నడుములమీద గోనెపట్టయు నున్నవి.
38మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను
దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది
ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు
నేను మోయాబును పగులగొట్టుచున్నాను
ఇదే యెహోవా వాక్కు.
39అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను
మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము.
మోయాబు తన చుట్టునున్న వారికందరికి
అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.
40యెహోవా సెలవిచ్చునదేమనగా
–పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద
తన రెక్కలను చాపుచున్నది.
41కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి
యున్నవి.
ఆ దినమున మోయాబు శూరుల హృదయము
ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
42మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా
అది జనము కాకుండ నిర్మూలమాయెను.
43మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు
నీమీదికి వచ్చియున్నవి
ఇదే యెహోవా వాక్కు.
44భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు
గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు
మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను
రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు.
దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోను
నీడలో నిలిచియున్నారు.
45హెష్బోనులోనుండి అగ్నియు
సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి
46మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని
కాల్చివేయుచున్నవి.
మోయాబూ, నీకు శ్రమ
కెమోషుజనులు నశించియున్నారు
నీ కుమారులు చెరపట్టబడిరి
చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.
47అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబువారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు.
ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 48: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.