యెషయా 65:17-25

యెషయా 65:17-25 TELUBSI

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ వింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరువారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురువారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగునువారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదనువారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 65:17-25 కోసం వీడియో