యెషయా 65:17-25
యెషయా 65:17-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాను. గత విషయాలు గుర్తు చేసుకోబడవు. వాటి గురించి ఎవరూ ఆలోచించరు. అయితే నేను సృష్టించబోయే వాటి గురించి మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి. నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా ప్రజలను ఆనందంగా చేస్తాను. నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు. “ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉండే శిశువులు ఉండరు. తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు; వంద సంవత్సరాల వయస్సులో చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు; వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే పాపిని శాపగ్రస్తుడు అంటారు. వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు; వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు. ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు. వారు వృధాగా కష్టపడరు, దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా, వారు, వారి వారసులు ఉంటారు. వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను; వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.
యెషయా 65:17-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను. గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను. అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను. నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను. ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు. కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు. ముసలివారు కాలం నిండకుండా చనిపోరు. నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు. నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు. ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు. వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు. వారు వృథాగా ప్రయాసపడరు. దిగులు తెచ్చుకుని పిల్లలను కనరు. వారు యెహోవా దీవించే ప్రజలుగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు. వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను. తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది. నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.
యెషయా 65:17-25 పవిత్ర బైబిల్ (TERV)
“చూడు, నేను ఒక క్రొత్త ఆకాశాన్ని ఒక క్రొత్త భూమిని చేస్తాను. గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు. ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు. నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు. నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను. మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను. “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను. నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను. ఆ పట్టణంలో మరల ఎన్నడూ ఏడుపు, దుఃఖం ఉండవు. జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు. కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు. జన్మించే ప్రతి శిశువు దీర్ఘకాలం జీవిస్తుంది. వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు. వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు. (అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బ్రతికినా అన్నీ కష్టాలే.) “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు. ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటితే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాడు. ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో నివసించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను నాటగా మరొకడు ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు. వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు. నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు. ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు. చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు. నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు. వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను. సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను. తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి. సింహాలు పశువులతో కలిసి మేస్తాయి. నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.” ఇవన్నీ యెహోవా చెప్పాడు.
యెషయా 65:17-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ వింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరువారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురువారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగునువారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదనువారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 65:17-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)