యెషయా 64
64
1గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక
నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.
2నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై
అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను
అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను
నీవు దిగివచ్చెదవు గాక.
3జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు
నీవు చేయగా
అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక
నీవు దిగివచ్చెదవు గాక
నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.
4తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప
తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని
ఎవడు నేకాలమున చూచియుండలేదు
అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు
వినబడలేదు
5అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.
నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు
సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు
చున్నావు.
చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి
బహుకాలమునుండి పాపములలో పడియున్నాము
రక్షణ మాకు కలుగునా?
6మేమందరము అపవిత్రులవంటివారమైతిమి
మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను
మేమందరము ఆకువలె వాడిపోతిమి
గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా
మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను
7నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక
పోయెను
నిన్ను ఆధారము చేసికొనుటకై
తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు
నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి
మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.
8యెహోవా, నీవే మాకు తండ్రివి
మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు
మేమందరము నీ చేతిపనియై యున్నాము.
9యెహోవా, అత్యధికముగా కోపపడకుము
మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి
కొనకుము
చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద
రము నీ ప్రజలమే గదా.
10నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను
సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.
11మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ
మందిరము.
మా శృంగారమైన#64:11 లేక, అతిశయాస్పదమైన. మందిరము అగ్నిపాలాయెను
మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.
12యెహోవా, వీటిని చూచి ఊరకుందువా?
మౌనముగానుందువా?
అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 64: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.