యెషయా 49
49
1ద్వీపములారా, నా మాట వినుడి,
దూరముననున్న జనములారా, ఆలకించుడి,
నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను
తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని
ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.
2నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు
తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు
నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి
తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.
3ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు
నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన
నాతో చెప్పెను.
4అయినను–వ్యర్థముగా నేను కష్టపడితిని
ఫలమేమియులేకుండ నా బలమును వృథాగా వ్యయ
పరచియున్నాననుకొంటిని
నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము
నా దేవునియొద్దనే యున్నది.
5యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు
నాకు బలమాయెను
కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో
బును తిరిగి రప్పించుటకు
ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు
నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల
విచ్చుచున్నాడు
6–నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును
ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును
నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము;
భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు
సాధనమగుటకై
అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి
యున్నాను.
7ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు
యెహోవా
మనుష్యులచేత నిరాకరింపబడినవాడును
జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు
వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–యెహోవా నమ్మకమైనవాడనియు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె
ననియు రాజులు గ్రహించి లేచెదరు
అధికారులు నీకు నమస్కారము చేసెదరు.
8యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి
నీకు ఉత్తరమిచ్చితిని
రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని.
–బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను
–బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు
దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి
పెట్టుటకై
నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.
9మార్గములలో వారు మేయుదురు
చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును
10వారియందు కరుణించువాడు వారిని తోడుకొని
పోవుచు
నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును
కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు
ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.
11నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను
నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.
12చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు
వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు
వచ్చుచున్నారు
వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.
13శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా
తన జనులను ఓదార్చియున్నాడు
ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ,
సంతోషించుము
పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.
14అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి
యున్నాడు
ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.
15స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన
చంటిపిల్లను మరచునా?
వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
16చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి
యున్నాను
నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
17నీ కుమారులు త్వరపడుచున్నారు
నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో
నుండి బయలు వెళ్లుచున్నారు.
18కన్నులెత్తి నలుదిశల చూడుము
వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు
నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు
పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవువారిని అలంకారముగా ధరించుకొందువు
నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని
యెహోవా సెలవిచ్చుచున్నాడు.
19నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి
స్థలములును నాశనము చేయబడిన నీ భూమియువారికి ఇరుకుగా ఉండును
నిన్ను మ్రింగివేసినవారు దూరముగా ఉందురు.
20నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా
రులు
–ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది.
ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో
చెప్పుదురు.
21అప్పుడు నీవు–నేను నా పిల్లలను పోగొట్టుకొని,
సంతానహీనురాలను, ఒంటరినై
ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా?
వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా
డెవడు?
నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ
ఉండిరి?
అని నీ మనస్సులో నీవనుకొందువు.
22ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నేను జనములతట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను
జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నానువారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు
నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు
23రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి
రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరువారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము
చేసెదరు
నీ పాదముల ధూళి నాకెదరు.
అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని
పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు
తెలిసికొందువు.
24బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన
గలడు?
భీకరులు#49:24 లేక, నీతిమంతులు. చెరపెట్టినవారు విడిపింపబడుదురా?
25యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–బలాఢ్యులు చెరపెట్టినవారు సహితము విడిపింప
బడుదురు
భీకరులు చెరపెట్టినవారు విడిపింపబడుదురు
నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము
చేసెదను
నీ పిల్లలను నేనే రక్షించెదను.
26యెహోవానైన నేనే నీ రక్షకుడననియు
యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు
లందరు ఎరుగునట్లు
నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె
దను
క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము
చేత వారు మత్తులగుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 49: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.