యెషయా 26

26
1ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన
పాడుదురు–
బలమైన పట్టణమొకటి మనకున్నది
రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను
ఆయన నియమించియున్నాడు.
2సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు
ద్వారములను తీయుడి.
3ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో
వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు.
ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి
యున్నాడు.
4యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము
యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
5ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును
దిగగొట్టువాడు
ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను
ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు
6కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి.
7నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును
నీతిమంతుల త్రోవను నీవు సరాళముచేయుచున్నావు.
8యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని
మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము
మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.
9రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది
నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది.
నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని
నేర్చుకొందురు.
10దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరువారు ధర్మక్షేత్రములో నివసించినను
యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము
చేయుదురు.
11యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు
దాని చూడనొల్లరు
జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు
దురు
నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మ్రింగివేయును.
12యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు
నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని
సఫలపరచుదువు.
13యెహోవా, మా దేవా,
నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి
ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము
14చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు
అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి
వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.
15యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును
వృద్ధిచేసితివి.
దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు
మహిమపరచుకొంటివి.
16యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి
నీ శిక్ష వారిమీద పడినందునవారు విశేషముగా దీన
ప్రార్థనలు చేసిరి
యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా
17గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు
మేము నీ సన్నిధిలో నున్నాము.
18మేము గర్భము ధరించి వేదనపడితిమి
గాలిని కన్నట్టు ఉంటిమి
మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి
లోకములో నివాసులు పుట్టలేదు.
19మృతులైన నీవారు బ్రదుకుదురు
నావారి శవములు సజీవములగును
మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స
హించుడి.
నీ మంచు ప్రకాశమానమైన మంచు
భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.
20నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు
లను శిక్షించుటకు
యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు
చున్నాడు
భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ
తాను త్రాగిన రక్తమును బయలుపరచును.
21నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము
నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము
ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 26: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెషయా 26