యెషయా 18

18
1ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను
చున్న రెక్కలుగల దేశమా!
2అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ
లలో రాయబారులను పంపుచున్నది
–వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన
చర్మముగలవారునగు జనమునొద్దకు
దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి.
నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన
ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు
పోవుడి.
3పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక
నివాసులైన మీరు
భూమిమీద కాపురముండు మీరు చూడుడి
బాకా ఊదునప్పుడు ఆలకించుడి.
4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు
–ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ
ములు మంచు కురియుచుండగాను
నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.
5కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు
వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా
ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు
లతాతంతులను కోసివేయును.
6అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న
మృగములకును విడువబడును
వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి
మీదనున్న మృగములును వాటిని తినును.
7ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగలవారును
దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు
దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు
సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా
ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను
పర్వతమునకు తేబడుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 18: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 18 కోసం వీడియో