యెషయా 16

16
1అరణ్యపుతట్టుననున్న సెలనుండి
దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా
2సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి
గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె
అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన
బడుదురు.
3ఆలోచన చెప్పుము విమర్శచేయుము.
చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద
ఉండనియ్యుము.
చెదరినవారిని దాచిపెట్టుము
పారిపోయినవారిని పెట్టియ్యకుము
4నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము
దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా
బీయులకు ఆశ్రయముగా ఉండుము
బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని
పోయెను.
అణగద్రొక్కువారు దేశములోలేకుండ నశించిరి.
5కృపవలన సింహాసనము స్థాపింపబడును
సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి
తీర్పుతీర్చు నొకడు కలడు
దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము
విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.
6మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నామువారి గర్వమునుగూర్చియు
వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు విని
యున్నాము.వారు వదరుట వ్యర్థము.
7కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు
అందరును అంగలార్చుదురు
మోయాబీయులారా
కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు
దొరకక మీరు మూలుగుదురు.
8ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా
వల్లులు వాడిపోయెను
దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు
అణగద్రొక్కిరి.
అవి యాజరువరకు వ్యాపించెను
అరణ్యములోనికి ప్రాకెను
దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును
దాటెను.
9అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా
వల్లుల నిమిత్తము ఏడ్చెదను
హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె
దను
ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు
నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత
మీదను పడి కేకలు వేయుదురు.
10ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను
ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ
ధ్వని వినబడదు
గానుగలలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు
ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను
మాన్పించియున్నాను.
11మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది
కీర్హరెశెతు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె
వాగుచున్నవి.
12మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస
పడి
ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును.
13పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి
సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా
ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు
14–కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా
మోయాబీయులయొక్క ప్రభావమును వారి గొప్ప
వారి సమూహమును అవమానపరచబడును
శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్ప
ముగా నుండును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 16: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెషయా 16