యెషయా 14

14
1ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును
ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును
వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులువారిని కలిసికొందురువారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
2జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమునవారిని ప్రవేశపెట్టుదురు
ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని
దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు
కొందురువారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి
తమ్మును బాధించినవారిని ఏలుదురు.
3-4నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన
కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను
విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును
గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున
పాడుదువు
బాధించినవారు ఎట్లు నశించిపోయిరి?
రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
5దుష్టుల దుడ్డుకఱ్ఱను
మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన
ఏలికల రాజదండమును
యెహోవా విరుగగొట్టియున్నాడు.
6వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనము
లను లోబరచిరి.
7భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది
జనములు పాడసాగుదురు.
నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా
మీదికి రాలేదని
8నిన్నుగూర్చి తమాలవృక్షములు
లెబానోను దేవదారువృక్షములు హర్షించును
9నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై
క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది.
అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది
భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల
నందరిని
వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
10వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ
వైతివా?
నీవును మాబోటివాడవైతివా? అందురు.
11నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును
పాతాళమున పడవేయబడెను.
నీ క్రింద పురుగులు వ్యాపించును
కీటకములు నిన్ను కప్పును.
12తేజోనక్షత్రమా, వేకువచుక్కా,
నీవెట్లు ఆకాశమునుండి పడితివి?
జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు
నరకబడితివి?
13–నేను ఆకాశమున కెక్కిపోయెదను
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును
హెచ్చింతును
ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
14మేఘమండలముమీది కెక్కుదును
మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును
అని
నీవు మనస్సులో అనుకొంటివిగదా?
15నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు
త్రోయబడితివే.
16-17నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు
తలపోయుదురు
–భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు
ఇతడేనా?
లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు
చేసినవాడు ఇతడేనా?
తాను చెరపెట్టినవారిని తమ నివాసస్థలమునకు పో
నియ్యనివాడు ఇతడేనా?
18జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ
తమ నగరులయందు నిద్రించుచున్నారు.
19నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె
నున్నావు.
ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప
బడినవాడవైతివి
త్రొక్కబడిన పీనుగువలెనైతివి
బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె
నున్నావు
20నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి
నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు
దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.
21వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము
లతో లోకమును నింపకుండునట్లు
తమపితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం
చుటకు దొడ్డి సిద్ధపరచుడి.
22సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే
–నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును
శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని
యెహోవా సెలవిచ్చుచున్నాడు.
23నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనముగాను నీటి మడు
గులగాను చేయుదును.
నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను
అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
24సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ
కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును
నేను యోచించినట్లు స్థిరపడును.
25నా దేశములో అష్షూరును సంహరించెదను
నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను
వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును
వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప
బడును.
26సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే
జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.
27సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి
యున్నాడు
రద్దుపరచగలవాడెవడు?
బాహువు చాచినవాడు ఆయనే
దాని త్రిప్పగలవాడెవడు?
28రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన
దేవోక్తి
29–ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా
విరువబడెనని అంతగా సంతోషింపకుము
సర్పబీజమునుండి మిడునాగు పుట్టును
దాని ఫలము ఎగురు సర్పము.
30అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు
దరిద్రులు సురక్షితముగా పండుకొందురు
కరవుచేత నీ బీజమును చంపెదను
అది నీ శేషమును హతము చేయును.
31గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ.
ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు
ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది
వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును
లేడు.
32జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది?
యెహోవా సీయోనును స్థాపించియున్నాడు
ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్ర
యింతురు అని చెప్పవలెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెషయా 14