కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీర మొక్కటే, ఆత్మ యు ఒక్కడే; ఆప్రకారమే మీ పిలుపువిషయమైయొక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
Read ఎఫెసీయులకు 4
వినండి ఎఫెసీయులకు 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఎఫెసీయులకు 4:1-7
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు