ద్వితీయోపదేశకాండము 9
9
1ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు. 2ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా. 3కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. 4నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలివేసినతరువాత–నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు. 5నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవావారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు. 6మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను. 7అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. 8హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకొనెను. 9ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని. 10అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను. 11ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి 12–నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారికాజ్ఞాపించిన త్రోవలోనుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను. 13మరియు యెహోవా–నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. 14నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహుజనముగా చేసెదనని నాతో చెప్పగా 15నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను. 16నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి. 17అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి 18మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి,మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 19ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. 20మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని 21అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని. 22మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. 23యెహోవా– మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు. 24నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు. 25కాగా నేనుమునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవా –మిమ్మును నశింపజేసెదననగా 26నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని–ప్రభువా యెహోవా, నీవు నీ మహిమవలన విమోచించి బాహుబలమువలన ఐగుప్తులోనుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. 27నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకముచేసికొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము; 28ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు–యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుటవలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో. 29నీవు నీ అధికబలముచేతను నీవు చాపిన నీ బాహువుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయోపదేశకాండము 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.