ద్వితీయోపదేశకాండము 3:23-29

ద్వితీయోపదేశకాండము 3:23-29 TELUBSI

మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు. ఆకాశమందేగాని భూమి యందేగాని నీవుచేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతి మాలుకొనగా యెహోవా మిమ్మునుబట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను–చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదుగాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును. అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.