మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగి తిమి. అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను –మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును; ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము –శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.
Read ద్వితీయోపదేశకాండము 2
వినండి ద్వితీయోపదేశకాండము 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ద్వితీయోపదేశకాండము 2:1-7
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు