1 దినవృత్తాంతములు 25
25
1మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా 2ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు. 3యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా షిమీ హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు. 4హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు. 5వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి యుండెను. 6వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానముచేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. 7యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతోకూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది. 8తాముచేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదములేకుండ వంతులకొరకై చీట్లువేసిరి. 9మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు. 10మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 11నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 12అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 13ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 14ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 15ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 16తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 17పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 18పదకొండ వది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 19పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు. 20పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 21పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 22పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 23పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు. 24పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 25పదు నెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 26పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 27ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 28ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 29ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 30ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. 31ఇరువది నాలుగవది రోమమ్తీయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 25: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.