1 దినవృత్తాంతములు 16

16
1ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి. 2దహనబలులను సమాధానబలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి 3పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.
4మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవచేయుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. 5వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు. 6బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధనమందసము ఎదుట బూరలు ఊదువారు.
7ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
8యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన నామమును ప్రకటనచేయుడి
ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
9ఆయననుగూర్చి పాడుడి
ఆయనను కీర్తించుడి
ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ
చేయుడి.
10ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి
యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో
షించుదురు గాక.
11యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి
ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.
12ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా
ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా
13ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి
కొనుడి
ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను
జ్ఞాపకము చేసికొనుడి.
14ఆయన మన దేవుడైన యెహోవా
ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
15మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులు
గాను
కనాను దేశములో అన్యులుగాను ఉండగా
కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
16ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
17ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును
నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
18వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన
సెలవిచ్చెను.
19యాకోబునకు కట్టడగాను
ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను
ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
20వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి
రాజ్యమునకును తిరుగులాడుచుండగా
21నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు
నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి
22ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదువారి నిమిత్తము రాజులను గద్దించెను.
23సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి
అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
24అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి
సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను
ప్రచురించుడి.
25యెహోవా మహాఘనత వహించినవాడు
ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు
సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
26జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే
యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
27ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి
బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
28జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి.
మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
29యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు
చెల్లించుడి
నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి
పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని
ఆయనయెదుట సాగిలపడుడి.
30భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి
అప్పుడు భూలోకము కదలకుండును
అప్పుడది స్థిరపరచబడును.
31యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి.
ఆకాశములు ఆనందించునుగాక
భూమి సంతోషించునుగాక
32సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక
పొలములును వాటియందుండు సర్వమును సంతో
షించునుగాక.
యెహోవా వేంచేయుచున్నాడు.
33భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు
చున్నాడు
వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును.
34యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర
ముండును.
ఆయనను స్తుతించుడి.
35దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము
మమ్మును చేర్చుకొనుము.
36మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించునట్లు
నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు
అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము
అని ఆయనను బతిమాలుకొనుడి.
ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా
యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక.
ఈలాగునవారు పాడగా జనులందరు ఆమేన్
37అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదినసేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధనమందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని 38యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. 39గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము 40ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. 41యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను. 42బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. 43తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 16: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for 1 దినవృత్తాంతములు 16