1 దినవృత్తాంతములు 14

14
1తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను. 2తన జనులగు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను.
3పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తెలను కనెను. 4యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను 5-7ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.
8దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబడెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. 9ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి. 10ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవా –పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. 11వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసి–జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము#14:11 అనగా, ప్రవాహముల స్థలము. అను పేరుపెట్టెను. 12వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను. 13ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా 14దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడు–నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి 15కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లియున్నాడని తెలిసికొనుమని సెలవిచ్చెను. 16దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదుచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గెజెరువరకు తరిమి హతముచేసిరి. 17కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనులకందరికి కలుగజేసెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 1 దినవృత్తాంతములు 14