1 దినవృత్తాంతములు 1:43-54

1 దినవృత్తాంతములు 1:43-54 TELUBSI

ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహొలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.