1 దినవృత్తాంతములు 1:43-54

1 దినవృత్తాంతములు 1:43-54 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు. బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె. హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు, ఒహోలీబామా, ఏలహు, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరు ఎదోము నాయకులు.

1 దినవృత్తాంతములు 1:43-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు. యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు. శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు. షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు. బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది. హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు, అహలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.

1 దినవృత్తాంతములు 1:43-54 పవిత్ర బైబిల్ (TERV)

ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా. బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు. యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు. హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు. హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి. శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు. షావూలు మరణానంతరం బయల్ – హానాను రాజయ్యాడు. బయల్ – హానాను తండ్రి పేరు అక్బోరు. బయల్ – హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె. కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు, అహలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.

1 దినవృత్తాంతములు 1:43-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహొలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.