1
ప్రసంగి 1:18
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది; ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.
సరిపోల్చండి
Explore ప్రసంగి 1:18
2
ప్రసంగి 1:9
ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.
Explore ప్రసంగి 1:9
3
ప్రసంగి 1:8
అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, మనుష్యులు దానిని వివరించలేరు. ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు.
Explore ప్రసంగి 1:8
4
ప్రసంగి 1:2-3
ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, “అర్థరహితం! అర్థరహితం! అంతా అర్థరహితమే.” సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి?
Explore ప్రసంగి 1:2-3
5
ప్రసంగి 1:14
సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.
Explore ప్రసంగి 1:14
6
ప్రసంగి 1:4
తరాలు వస్తాయి తరాలు పోతాయి, కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది.
Explore ప్రసంగి 1:4
7
ప్రసంగి 1:11
పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు, రాబోయే తరాలు కూడా వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు అసలే జ్ఞాపకముండవు.
Explore ప్రసంగి 1:11
8
ప్రసంగి 1:17
ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
Explore ప్రసంగి 1:17
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు