కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు.
తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు.
వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు.