1
రోమా 6:23
తెలుగు సమకాలీన అనువాదము
పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసుక్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.
సరిపోల్చండి
Explore రోమా 6:23
2
రోమా 6:14
మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు గాని, కృప కలిగివున్నారు కనుక ఇక మీదట పాపం మీ మీద అధికారాన్ని కలిగివుండదు.
Explore రోమా 6:14
3
రోమా 6:4
తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతోపాటు పాతిపెట్టబడ్డాము.
Explore రోమా 6:4
4
రోమా 6:13
దుష్టత్వాన్ని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి ఇవ్వవద్దు, కాని మరణం నుండి జీవంలోనికి తీసుకొనిరాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించండి.
Explore రోమా 6:13
5
రోమా 6:6
మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించునట్లు, మన పాత స్వభావం ఆయనతోపాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.
Explore రోమా 6:6
6
రోమా 6:11
అలాగే, పాప విషయంలో చనిపోయాం కాని యేసుక్రీస్తులో దేవుని కొరకు సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి.
Explore రోమా 6:11
7
రోమా 6:1-2
అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? ఎన్నడు అలా చెప్పకూడదు, పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం?
Explore రోమా 6:1-2
8
రోమా 6:16
మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా?
Explore రోమా 6:16
9
రోమా 6:17-18
ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికి, మీకు బోధించిన మాదిరికి మీరు హృదయమంతటితో లోబడ్డారు, కనుక అది ఇప్పుడు మీ విధేయతగా చెప్పబడుతుంది కనుక దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.
Explore రోమా 6:17-18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు