1
రోమా 5:8
తెలుగు సమకాలీన అనువాదము
కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనకొరకు మరణించుట ద్వారా దేవునికి మనపట్ల గల తన ప్రేమను కనుపరచారు.
సరిపోల్చండి
Explore రోమా 5:8
2
రోమా 5:5
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కనుక నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.
Explore రోమా 5:5
3
రోమా 5:3-4
అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కనుక శ్రమలలో కూడా మనం ఆనందించగలము. ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది.
Explore రోమా 5:3-4
4
రోమా 5:1-2
మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగివున్నాము. ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం
Explore రోమా 5:1-2
5
రోమా 5:6
సరియైన సమయంలో, మనం ఇంకనూ బలహీనులమై ఉన్నప్పుడే, క్రీస్తు భక్తిహీనుల కొరకు మరణించారు.
Explore రోమా 5:6
6
రోమా 5:9
ఇప్పుడైతే మనం ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడియున్నాం, అలాంటప్పుడు మనం ఇంకెంతగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం!
Explore రోమా 5:9
7
రోమా 5:19
ఒక్క మానవుని అవిధేయత వలన అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.
Explore రోమా 5:19
8
రోమా 5:11
ఇది మాత్రమే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాం.
Explore రోమా 5:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు