1
రోమా 15:13
తెలుగు సమకాలీన అనువాదము
పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.
సరిపోల్చండి
Explore రోమా 15:13
2
రోమా 15:4
గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కొరకు మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.
Explore రోమా 15:4
3
రోమా 15:5-6
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియైన దేవుణ్ణి మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగివున్న మనోవైఖరి మనం ఒకరి పట్ల ఒకరం కలిగివుండేలా మనకు అనుగ్రహించును గాక.
Explore రోమా 15:5-6
4
రోమా 15:7
క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి.
Explore రోమా 15:7
5
రోమా 15:2
మనలో ప్రతీ ఒక్కరు మన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కొరకు వారిని సంతోషపెట్టాలి.
Explore రోమా 15:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు