మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు. నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?”