1
1 కొరింథీ పత్రిక 15:58
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ పత్రిక 15:58
2
1 కొరింథీ పత్రిక 15:57
అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
Explore 1 కొరింథీ పత్రిక 15:57
3
1 కొరింథీ పత్రిక 15:33
మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”
Explore 1 కొరింథీ పత్రిక 15:33
4
1 కొరింథీ పత్రిక 15:10
అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే.
Explore 1 కొరింథీ పత్రిక 15:10
5
1 కొరింథీ పత్రిక 15:55-56
“ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?” మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే.
Explore 1 కొరింథీ పత్రిక 15:55-56
6
1 కొరింథీ పత్రిక 15:51-52
నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము.
Explore 1 కొరింథీ పత్రిక 15:51-52
7
1 కొరింథీ పత్రిక 15:21-22
ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది. ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.
Explore 1 కొరింథీ పత్రిక 15:21-22
8
1 కొరింథీ పత్రిక 15:53
ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి.
Explore 1 కొరింథీ పత్రిక 15:53
9
1 కొరింథీ పత్రిక 15:25-26
ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు. చివరిగా నశించే శత్రువు మరణం.
Explore 1 కొరింథీ పత్రిక 15:25-26
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు