1
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:12
పవిత్ర బైబిల్
మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము.
సరిపోల్చండి
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:12
2
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:18
ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:18
3
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:11
సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:11
4
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:13
కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:13
5
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:16-17
వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:16-17
6
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:14-15
కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:14-15
7
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:10
చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:10
8
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2-3
“మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2-3
9
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:1
బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు