1
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:8
పవిత్ర బైబిల్
అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి.
సరిపోల్చండి
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:8
2
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:10
ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:10
3
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:11
మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:11
4
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:16
మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:16
5
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:7
అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:7
6
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:12-13
నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:12-13
7
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:9
సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:9
8
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:19
అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:19
9
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:1-2
క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:1-2
10
పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:14
ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 4:14
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు