1
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:15-16
పవిత్ర బైబిల్
క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
సరిపోల్చండి
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:15-16
2
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:12
నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు. కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:12
3
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:3-4
జడలు వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా మీ అంతరాత్మను సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:3-4
4
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:10-11
లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది: “బ్రతకాలని ఇష్టపడే వాడు, మంచిరోజులు చూడదలచినవాడు, తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి. చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:10-11
5
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:8-9
చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:8-9
6
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:13
ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు?
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:13
7
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:11
చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:11
8
పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:17
చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
Explore పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:17
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు