1
ఎఫెసీయులకు 6:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
సరిపోల్చండి
Explore ఎఫెసీయులకు 6:12
2
ఎఫెసీయులకు 6:18
ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
Explore ఎఫెసీయులకు 6:18
3
ఎఫెసీయులకు 6:11
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
Explore ఎఫెసీయులకు 6:11
4
ఎఫెసీయులకు 6:13
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
Explore ఎఫెసీయులకు 6:13
5
ఎఫెసీయులకు 6:16-17
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
Explore ఎఫెసీయులకు 6:16-17
6
ఎఫెసీయులకు 6:14-15
ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.
Explore ఎఫెసీయులకు 6:14-15
7
ఎఫెసీయులకు 6:10
తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
Explore ఎఫెసీయులకు 6:10
8
ఎఫెసీయులకు 6:2-3-2-3
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.
Explore ఎఫెసీయులకు 6:2-3-2-3
9
ఎఫెసీయులకు 6:1
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే.
Explore ఎఫెసీయులకు 6:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు