Free Reading Plans and Devotionals related to మత్తయి 6:8
ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడం
5 రోజులు
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
మీకు ఒక ప్రార్థన ఉంది!
6 రోజులు
శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
అందని దానికొరకు పడే తాపత్రయం
7 రోజులు
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.
ప్రార్థన
21 రోజులు
చక్కగా ప్రార్ధించడమెలాగో నేర్చుకొందాము, విశ్వాసుల యొక్క ప్రార్థనలు మరియు అలాగే యేసు యొక్క మాటల నుండి కూడా. ప్రతిరోజూ దేవునికి మీ అభ్యర్థనలను ఎడతెరిపిలేకుండా మరియు సహనంతో కొనసాగించడం కోసం ప్రోత్సాహాన్ని పొందండి. స్వచ్ఛమైన హృదయాలతో ఉన్నవారి స్వచ్ఛమైన ప్రార్థనలకు వ్యతిరేకంగా సంతులనం చేయబడిన ఖాళీ, స్వీయ నీతిమంతమైన ప్రార్థనల ఉదాహరణలు అన్వేషించండి. నిరంతరం ప్రార్ధించండి.