ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 పేతురు 5:3 కు సంబంధించిన వాక్య ధ్యానములు

దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుట
5 రోజులు
భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి

ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణము
7 రోజులు
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.