ఆదికాండము 10
10
జనముల అభివృద్ధి, విస్తరణ
1నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
యాఫెతు సంతానము
2యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
4యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతులవారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
హాము సంతానము
6హాము కుమారులు కూషు, మిస్రాయిము,#10:6 మిస్రాయిము ఇది ఈజిప్టు యొక్క మరో పేరు. పూతు, కనాను.
7కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.
రాయమా కుమారులు షేబ, దదాను.
8కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. 9నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.
10షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదుకల్నే అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది. 11నిమ్రోదు అష్షూరుకు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె, రహోబోతీరు, కాలహు, 12రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
13లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 14పత్రుసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారే.)
15సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. 16యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి.
కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. 19ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
20ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు.
షేము సంతానము
21యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
22షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష.
24అర్పక్షదు షేలహుకు తండ్రి.
షేలహు ఏబెరుకు తండ్రి.
25ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు#10:25 పెలెగు అనగా విభజన అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
26యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27హదోరము, ఊజాలు, దిక్లాను 28ఓబాలు, అబీమాయెలు, షేబ, 29ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. 30మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
31వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
32నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.
Aktuálne označené:
ఆదికాండము 10: TERV
Zvýraznenie
Zdieľať
Kopírovať

Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International