YouVersion Logo
Search Icon

Plan Info

నిజమైన ఆధ్యాత్మికతSample

నిజమైన ఆధ్యాత్మికత

DAY 3 OF 7

దేవుని శ్రేష్టమైన దానిని పొందుకోవడం

దేవుడు శ్రేష్టమైన దానిని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన దానిని నిర్వచించినట్లుగా అది  అత్యంత సులభమైనకాదు లేదా విలాసవంతమైనదీ అయితే అది శ్రేష్టమైనది. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చిత్తం “మంచిది, సంతోషకరమైనది, పరిపూర్ణమైనది.”

అయితే అనేకమంది క్రైస్తవులు దేవుని శ్రేష్టమైనదానిని అనుభవించరు. ఎందుకు?

దీనికి ఒక కారణం అబద్ధాలు: జీవిత అర్ధం గురించిన అబద్దాలు, మనకోసం దేవుని ఉద్దేశాలను గురించిన అబద్ధాలు. అబద్దాలు లోక మార్గాలకు మనలను అనుగుణంగా ఉంచుతాయి. లోకం చూసే విధంగా జీవితాన్ని చూడటం దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన హెచ్చరికలను అర్థం చేసుకోకుండా చేస్తుంది. దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న అద్భుతమైన విషయాలను మనం కోల్పోతాము.

అబద్ధాలు ఎక్కడ నుండి వచ్చాయి?

·  మన జీవితాలలో దేవుని ఉద్దేశాలను వ్యతిరేకించే ఆధ్యాత్మిక శత్రువు మనకు ఉన్నాడు.

·  దేవుని ఉద్దేశాలను వక్రీకరించే పతన లోకంలో మనం జీవిస్తున్నాము.

·  మనలో ప్రతి ఒక్కరికి మన ప్రాచీన, పాప స్వభావంతో సుదీర్ఘ చరిత్ర ఉంది.

ఈ మూడు శక్తులు పాత విధానాలలో మనం చిక్కుకుపోయేలా కలిసిపోతాయి. ఈ కారణంగానే అపొస్తలుడైన పౌలు లోక మర్యాదను అనుసరించకూడదనీ, మన మనస్సులు మారి నూతన పరచబడడం ద్వారా మనం రూపాంతరం చెందాలని చెపుతున్నాడు. 

మనం:

·  లోక సంబంధ ఆలోచనలతో మనల్ని మనం పోషించుకోవడం మానివేయాలి, 

·  దానికి బదులుగా దేవుని మార్గాలతో మన మనస్సులను నింపుకోవాలి.

మన మీద దేవుని కున్న ప్రేమ మీద సంపూర్ణ విశ్వాసంలో వేరుపారిన నిజమైన ఆత్మీయ ఆహారం మనకు అవసరం. అప్పుడు మాత్రమే మన జీవితాలు మార్పు చెందడం ఆరంభం అవుతాయి. అప్పుడు మాత్రమే మనం ఆయన మంచిదీ,సంతోషకరమైనదీ, పరిపూర్ణమైనదీ అయిన ఆయన చిత్తాన్ని మనం అనుభవించగలం, నిజమైన ఆత్మీయతను అనుభవించగలం. 

Scripture

Day 2Day 4

About this Plan

నిజమైన ఆధ్యాత్మికత

యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృ...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy